బాలయ్య బాబు స్మోకింగ్ అలవాటు గురించి స్పందించిన డైరెక్టర్ బాబీ...

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. దీంతో డాకు మహారాజ్ టీమ్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులోభాగంగా శుక్రవారం హైదరాబాద్ లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్, డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

బాలకృష్ణ తో ఏపని చెయ్యడం చాలా సంతోషంగా ఉందని అలాగే బాలయ్య డైరెక్టర్స్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడని ఈ అంశం చాలా నచ్చిందని అన్నాడు. ఇక బాలయ్య బాబు ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. మాములుగా కొందరు హీరోలు డైరెక్టర్స్ ని లేక చెయ్యరని అలాగే స్మోకింగ్ చేస్తున్న సమయంలో పట్టించుకోరని, కానీ బాలకృష్ణ మాత్రం స్మోక్ చేస్తున్న సమయంలో సీన్ ఎక్స్ ప్లైన్ చెయ్యడానికి వెళితే వెంటనే సిగరెట్ ఆర్పేసి మరీ గౌరవం ఇస్తాడని తెలిపాడు. 

ALSO READ | Upasana Konidela: గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ హిట్... కంగ్రాచ్యులేషన్స్ హస్బెండ్ గారు అంటూ విష్ చేసిన ఉపాసన.

ఇతర ఆర్టిస్టులతో కూడా చాలా హుందాగా వ్యవహరిస్తాడని ప్రశంసించాడు. భవిష్యత్ లో కచ్చితంగా మళ్ళీ బాలయ్యతో మరో అద్భుతమైన స్క్రిప్ట్ తో పనిచేస్తానని తెలిపాడు. ఇక వర్క్ విషయంలో డైరెక్టర్ చెప్పింది మాత్రమే చేస్తూ బెస్ట్ ఔట్ ఫుట్ కోసం 100 శాతం  ఎఫర్ట్స్ పెడతాడని బాలయ్యతో కలసి పని చెయ్యడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఇదే ఈవెంట్ లో డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. గతంలో ట్రైలర్ రిలీజ్ చేసినప్పటికీ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఈరోజు రిలీజ్ చేసిన డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్, బాబీ టేకింగ్, బాలయ్య ఊరమాస్ డైలాగ్స్, ఒక్కసారిగా డాకు మహారాజ్ సినిమాపై అంచానాలు పెంచేసాయి. దీంతో సంక్రాంతి బరిలో విన్నర్ డాకు మహారాజ్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.