పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) కండక్ట్ చేస్తోన్న దావత్(Daawath) షో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా దూసుకెళ్తోంది. అషూ రెడ్డి హోస్ట్ గా చేసిన ఫస్ట్ ఎపిసోడ్కి గెస్ట్గా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వచ్చి సరదా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు.
లేటెస్ట్గాసెకండ్ ఎపిసోడ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్కి యాంకర్ అరియానా (Ariyana) హోస్ట్గా చేయగా హీరో సిద్ధార్ద్(Siddarth) గెస్ట్గా వచ్చారు. చలాకీతనం, ముక్కుసూటితనంతో అరియనా హోస్ట్ గా ఆకట్టుకుంది. అంతేకాకుండా..ఈ షోలో అదితి హైదరి..సిద్ధార్థ్ కి మధ్య ఉన్న రిలేషన్..అలాగే సిద్ధార్ధ్ సినిమాల్లో చూపించే హుషారుపైన ఇంట్రెస్టింగ్ ప్రశ్నలతో షో సాగింది.
యాంకర్‌గా కెరీయర్ ప్రారంభించి బిగ్బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అడిగే సెటైరికల్ ప్రశ్నలకు హీరో సిద్ధార్ధ్ తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం ఈ షో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది.