
ఓటీటీకి(OTT) వచ్చే సినిమాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ, జీ5 వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వారానికి 20కి పైగా సినిమాలు, సిరీస్ లు వచ్చి సందడి చేస్తున్నాయి.
ఈ క్రమంలో నెట్ఫ్లిక్స్ (Netflix) కొత్త వెబ్ సిరీస్ తీసుకొచ్చింది. హితేష్ భాటియా దర్శకత్వంలో 'డబ్బా కార్టెల్' (Dabba Cartel) అనే వెబ్ సిరీస్ నేడు (ఫిబ్రవరి 28న) స్ట్రీమింగ్ కి వచ్చింది. డబ్బా కార్టెల్‌ను ఫర్హాన్ అక్తర్ మరియు రితేష్ సిద్వానీ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించారు.
ఈ సిరీస్లో బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ లీడ్ రోల్లో నటించింది. ఆమెతోపాటు మరో సీనియర్ నటి జ్యోతిక, షాలిని పాండే ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.
డబ్బులు సంపాదించడానికి లంచ్ సప్లై చేసే ఐదుగురు మహిళలు అనుకోకుండా ఓ డ్రగ్స్ రాకెట్ బారిన పడితే ఎలా ఉంటుందన్నది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఐదుగురు మహిళలు డ్రగ్స్ వ్యాపారం చేస్తుండటం.. అది వినూత్నంగా లంచ్ బాక్సుల్లో సప్లయ్ చేయడం కొత్త అనుభూతిని రేకిత్తిస్తోంది.
డబ్బా కార్టెల్ స్టోరీ:
వివిధ రంగాలకు చెందిన అమాయకంగా కనిపించే మధ్యతరగతి మహిళలు డాబా సేవ (ముంబైలో ప్రసిద్ధ టిఫిన్ సేవ) వ్యాపారంలో పాల్గొంటారు. కానీ వీరి దగ్గర కంటికి కనిపించే దానికంటే డబ్బాలు ఎక్కువ ఉండటంతో కథలో మలుపు కనిపిస్తుంది. ఓ సాధారణ టిఫిన్ సర్వీస్ నడిపించే మహిళలు డ్రగ్స్ అక్రమ రవాణాలో చిక్కుకోవడం, వీరితో పాటు ఓ ఫార్మాసూటికల్ కంపెనీలో పని చేసే ఉద్యోగులు సైతం ఇందులో ఉన్నారని తెల్వడం సిరీస్ పై హైప్ క్రియేట్ చేసింది. ఈ సాధారణ మహిళలు చేసే డ్రగ్స్ వ్యాపారం కారణంగా వీరి కుటుంబాలు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? వీరు తమ జీవితాలను ఎదుర్కోవడానికి ఎంత దూరం వెళతారనేది ప్రధాన స్టోరీ.