టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాకి తెలుగు ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించగా స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించాడు. బ్యూటిఫుల్ హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఉర్వశి రౌతేలా(బాలీవుడ్) తదితరులు బాలయ్యకి జంటగా నటించారు.
ALSO READ | Game Changer Trailer: రాజమౌళి చేతుల మీదుగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్.. బాక్సాఫిస్ షేక్ ఖాయమే..
గురువారం డాకు మహారాజ్ సినిమాలోని "దబిడి దిబిడే" అనే పాటని మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ పాటని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేశాడు. అలాగే యంగ్ సింగర్ వాగ్దేవి తో కలసి పాడాడు. ప్రముఖ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు. ఊలాల, ఊలాల అంటే మొదలయ్యే లిరిక్స్, బాలయ్య బాబు ఊర్వశితో కలసి వేసిన స్టెప్పులు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో సంక్రాంతి బరిలో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న రిలీజ్ కాబోతోంది.