
కేజీఎఫ్ మూవీ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నNTR30(వర్కింగ్ టైటిల్) భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో NTR30 కూడా అదే రేంజ్ లో భారీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో క్యాస్ట్ & క్రూ విషయంలో కూడా పాన్ ఇండియా లెవెల్ ఉన్న సెలబ్రెటీలని తీసుకుంటున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలని సంప్రదించినట్లు తెలుస్తోంది. అంతేకాదు 5 నిమిషాలపాట కోసం దాదాపుగా రూ.6 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఊర్వశి రౌటేల ఇప్పటివరకూ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), నందమూరి బాలకృష్ణ (డాకు మహారాజ్) సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.
ఈ ఇద్దరి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ఊర్వశి ని ఎన్టీఆర్ నీల్ సినిమాకోసం సెలక్ట్ చేసినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ముంబైలో జరగనున్న షూటింగ్ షెడ్యూల్ లో ఊర్వశి రౌటేల కూడా జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ వార్తలో నిజమెంతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ గురువారం (ఫిబ్రవరి 20) హైదరాబాద్ లో మొదలైంది. ఇందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో కొన్ని యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కించారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సెట్స్ లో ఉన్న ఫోటోలని మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ప్రశాంత్ నీల్ మైక్ పట్టుకుని కార్ పై నిలబడి ఉన్నాడు. అలాగే మంటల్లో తగలబడిపోతున్న అంబాజిడర్ కారుని చుపియించారు.
ALSO READ : Choreographer Son: కొడుకును పరిచయం చేసిన స్టార్ కొరియోగ్రాఫర్.. తగిన వారసుడొచ్చాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు
ఈ ఫొటోతోపాటూ #NTRNeel షూటింగ్ అధికారికంగా ప్రారంభమైందని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపారు. దీంతో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఎడాది చివరికి ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దీంతో వచ్చే ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది రిలీజ్ అయిన తారక్ సినిమా దేవర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.