
న్యూఢిల్లీ: సబ్బులు, కాస్మొటిక్స్ వంటి ఎఫ్‌ఎంసీజీ ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేసే డాబర్ బుధవారం ఆయుర్వేద వ్యక్తిగత సంరక్షణ, వెల్నెస్ కంపెనీ సెసా కేర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.315-3–25 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువతో డీల్ కుదిరింది. ఈ కొత్త కొనుగోలతో డాబర్ రూ.900 కోట్ల ఆయుర్వేద హెయిర్ ఆయిల్ మార్కెట్‌లో విస్తరించేందుకు సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. సెసా తమ చేతికి రావడం వల్ల వ్యాపార అవకాశాలు మరింత పెరుగుతాయని డాబర్ సీఈఓ మోహిత్ మల్హోత్రా తెలిపారు. సెసా కేర్, ఆయుర్వేద హెయిర్ ఆయిల్ విభాగంలో మూడవ అతిపెద్ద కంపెనీ. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 133.3 కోట్ల టర్నోవర్సాధించింది.