స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తోంది నయనతార. ఆమె కీర్తి కిరీటంలో మరో అవార్డు చేరింది. ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024’ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం రాత్రి ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ‘జవాన్’ చిత్రంలో నటనకు గాను నయనతార ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ పాల్గొన్న ఈ ఈవెంట్‌కు గ్రీన్ కలర్ చీరలో హాజరైన నయనతార.. సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఇక ‘జవాన్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్ అవార్డును అందుకోగా, ‘యానిమల్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగా బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డును అందుకున్నాడు. బెస్ట్ నెగిటివ్ రోల్‌కు ‘యానిమల్’లో నటించిన బాబీ డియోల్, క్రిటిక్స్ ఉత్తమ నటుడు అవార్డును విక్కీ కౌశల్ (సామ్ బహదూర్), క్రిటిక్స్ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ అవార్డులు గెలుచుకున్నారు. సినిమాలతో పాటు టీవీ, వెబ్ సిరీస్‌లకు కూడా అవార్డులను అందజేశారు. రాణి ముఖర్జీ, షాహిద్ కపూర్, నీల్ భట్, విక్రాంత్ మాస్సే, ఐశ్వర్య శర్మ తదితరులు పాల్గొన్నారు.