మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
  • అక్టోబర్ ​8న  అందుకోనున్న సినీ లెజెండ్
  • ‘ఎక్స్’ ద్వారా ప్రకటించినకేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‘ఐ యామ్​ఏ డిస్కో డాన్సర్’​  పాటతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి
  • మొదటి సినిమాతోనే జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు
  • హీరోగా, నిర్మాతగా, వాణిజ్యవేత్తగా సక్సెస్​
  • పద్మభూషణ్​తో సత్కరించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ:బాలీవుడ్ లెజెండ్ మిథున్ చక్రవర్తి ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ఇండియాలో అత్యున్నత సినీ పురస్కారమైన ఫాల్కే అవార్డును మిథున్ చక్రవర్తి అక్టోబరు 8న జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అందుకోనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్​’లో ప్రకటించారు. ‘‘మిథున్ దా అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. దాదా సాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ భారతీయ సినీ లెజెండరీ నటుడు, మిథున్ చక్రవర్తి జీకి ఆయన సినీ రంగానికి చేసిన అసమాన సేవలకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించడం గౌరవంగా ఉంది” అని తన పోస్టులో పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 74 ఏండ్ల మిథున్.. 48 ఏండ్లుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 1976లో మొదటి చిత్రం ‘మృగయా’ తో నేషనల్ అవార్డు అందుకున్న ఆయన.. నటుడిగా, నిర్మాతగానూ సినీ రంగానికి సేవలు అందించారు. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకోగా.. ఈ ఏడాది జనవరిలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు అందజేసింది. 

ఇప్పుడు దాదా సాహెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సత్కరించనుంది. ‘ఐ యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏ డిస్కో డ్యాన్సర్’ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యారు. జగీర్, హమ్సే హై జమానా వంటి సినిమాలు మిథున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పేరు తెచ్చిపెట్టాయి. బెంగాలీ, హిందీ, ఒడిశా, భోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురి, తెలుగు, తమిళ, కన్నడ, పంజాబీలో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించారు. హీరో, నిర్మాత, వాణిజ్యవేత్తగా ఆయన సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

పవన్​తో గోపాలా గోపాలా సినిమాలో

తెలుగు ప్రేక్షకులకు కూడా మిథున్ సుపరిచతమే. పవన్ కల్యాణ్, వెంకటేశ్ కాంబినేషన్​లో వచ్చిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామీజీగా నటించి మెప్పించారు. కలకత్తాలో 1950 లో మిథున్​ జన్మించారు. 1976లో మృగయా అనే సినిమాతో నటుడిగా కెరీర్​ ప్రారంభించారు. 1992లో తహదర్ కథ అనే సినిమాకి, 1998లో స్వామి వివేకానంద అనే సినిమాకు కూడా ఆయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు వచ్చాయి. రీసెంట్​గా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ లో కనిపించాడు.