ముంబై నగరం విడిచి పారిపోని ఏకైక ముంబై డాన్ అరుణ్ గావ్లీ తన కోట దగ్డీ చాల్, బైకుల్లా వద్ద నవరాత్రి హారతి నిర్వహించడానికి రావడంతో సందడి నెలకొంది. అనేక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఆయన.. ప్రస్తుతం పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. దావూద్ ఇబ్రహీంను ఓడించేందుకు ప్రయత్నించి ఓడిపోయిన గ్యాంగ్‌స్టర్లలో అరుణ్ ఒకడు. వాస్తవానికి, చాలా సంవత్సరాల క్రితం క్రైమ్ బ్రాంచ్‌లోని సీనియర్ అధికారి వారి మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించారు. కాని గావ్లీ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. గావ్లీ, అతని మాజీ ప్రత్యర్థి ఛోటా రాజన్ దావూద్‌లో ఉమ్మడి శత్రువును కలిగి ఉన్నారు. అతను పాకిస్తాన్‌లో ISIతో చురుకుగా సహకరిస్తున్నట్టు సమాచారం.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే గావ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ ఆయన సెంట్రల్ ముంబైలో విపరీతమైన పలుకుబడిని కలిగి ఉన్నాడు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే అతన్ని హిందూ డాన్ అని బహిరంగంగా కీర్తించారు. ఎన్నికలు దాదాపుగా సమీపిస్తుండడంతో చాలా పార్టీలు ఆయన్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు, సపోర్ట్ ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ గావ్లీ ఫలానా పార్టీకి అని కమిట్ అవడానికి ముందు.. ఇప్పుడు ఆయన వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం ఆయన.. కీలకమైన హోమ్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో బీజేపీకి మద్దతు ఇవ్వనున్నారు