దగ్గుబాటి( Daggubati) వారింట పెళ్లి సందడి మొదలు కానుంది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ (Daggubati Suresh) రెండో కొడుకు దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram)పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం. పెళ్లికూతురు కారంచేడుకు చెందిన తన చినతాత కూతురు కూతురునే పెళ్లాడనున్నాడట అభిరామ్..
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..అభిరామ్ దగ్గుబాటి ఈ డిసెంబర్‌లో మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఈ సెలబ్రిటీ వెడ్డింగ్‌కి సంబంధించిన కొన్ని లీకులు అందుతున్న సమాచారం మేరకు..ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ అని..అందుకు శ్రీలంకలోని `అనంతర కలుతారా`వంటి సుందరమైన ఐదు నక్షత్రాల రిసార్ట్ లో మ్యారేజ్ జరగనున్నట్లు సమాచారం.
కాగా అభిరాంను మ్యారేజ్ చేసుకోబోయే వధువు పేరు ప్రత్యూష చపరా. అంతేకాకుండా..వీరిద్దరి పెళ్లి డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు జరగనుందని సినీ మీడియా సోర్సెస్ చెబుతున్నాయి. వీరి పెళ్ళికి దాదాపు 200 మంది పైగా అటెండ్ అవకాశం కనిపిస్తోంది.
ఈ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు, పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.ఈ అతిథులు అందరు సోమవారం (డిసెంబర్ 4న) శ్రీలంకలో అడుగుపెట్టనున్నారు. ఇక్కడ రాత్రి 8:30 గంటలకు గ్రాండ్ డిన్నర్ పార్టీతో ఈవెంట్ స్టార్ట్ అవుతుండగా..మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు మెహందీ వేడుక, ఆ తర్వాత విందు ఏర్పాటు చేస్తారు. ఇక బుధవారం ఉదయం 10:30 గంటలకు పెళ్లికూతురు వేడుక నిర్వహించి అనంతరం రాత్రి 8:50 గంటలకు తాళికట్టు సుముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
ఇక అభిరామ్ విషయానికి వస్తే..రీసెంట్ గా ఆయన హీరోగా వచ్చిన అహింస సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మొదటి సినిమాతోనే పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అభిరామ్. ప్రస్తుతం తన రెండో సినిమాను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో.