
టీడీపీ జనసేన పొత్తు విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు.పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుగా చూడట్లేదని అన్నారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని కోమల విలాస్ సెంటర్‌లో వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.
బీజేపీతో జనసేన పొత్తు ఉందన్నారు. పొత్తుల విషయమై కేంద్ర పెద్దలతో చర్చించాక తమ అభిప్రాయాలు వెల్లడిస్తామన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనదే అసత్య ప్రచారమని చెప్పుకొచ్చారు. సీఐడీ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుందని పురందేశ్వరి తెలిపారు. కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.