సికింద్రాబాద్: పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనతో పోలీసులు సెలబ్రిటీలు వస్తున్నారంటే చాలు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో దగ్గుబాటి రానా ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఓ షూటింగ్ నిమిత్తం ఆలయానికి దగ్గుబాటి రానా వెళ్లడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
భక్తులను లోపలికి అనుమతించకపోవడంతో పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల పర్మిషన్ తీసుకొని గణపతి దేవాలయానికి రానా, యాంకర్ సుమతో పాటు పలువురు రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. ఆలయానికి వెళ్లకుండా భక్తులను అడ్డుకోవడంతో పోలీసుల తీరు పట్ల భక్తులు మండిపడ్డారు.
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు శ్రీతేజ్ మృత్యువుతో పోరాడుతూ ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడు. ఈ దుర్ఘటన తర్వాత పోలీసులు ఎక్కడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. సినిమా వాళ్లు ఎక్కడికైనా వెళ్తున్నారంటే చాలు భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. అయితే.. సెలబ్రెటీలు ఇలా వెళ్లడం వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అల్లు అర్జున్ డిసెంబర్ 4, 2024నరాత్రి 9:30 కు సంధ్య థియేటర్కు రాగా.. ఆయన లోపలకు వెళ్లడానికి పోలీసులు, బౌన్సర్లు, పర్సనల్సెక్యూరిటీ అందరినీ చెదరగొట్టి రూట్క్లియర్చేశారు. ఈ క్రమంలో బయటి నుంచి లోపలకు వచ్చేందుకు చాలామంది అభిమానులు దూసుకువచ్చారు. అప్పటికే థియేటర్లోపల ఒకవైపు భాస్కర్ అతడి కూతురు, మరోవైపు రేవతి, ఈమె కొడుకు శ్రీతేజ్ ఉన్నారు. బన్నీవస్తున్నాడని తెలుసుకుని లోపలున్న అభిమానులంతా తోసుకురాగా వారితో పాటు శ్రీతేజ్ కూడా పరిగెత్తాడు. కొడుకును పట్టుకునే క్రమంలో తల్లి రేవతి కూడా వెంట పరుగెత్తింది. దీంతో శ్రీతేజ్కిందపడగా అభిమానులంతా అతడిని తొక్కుకుంటూ వెళ్లారు.
శ్రీతేజ్ను కాపాడుకునే ప్రయత్నంలో రేవతి కూడా ప్రేక్షకుల కాళ్ల కింద నలిగిపోయింది. మరికొంతమంది కూడా గాయపడ్డారు. ఈ దశలో అక్కడే ఉన్న పోలీసులు.. అరుపులు, కేకలు విని అందరినీ చెదరగొట్టారు. స్పృహ తప్పిన రేవతి, అతడి కొడుకును బయటకు తీసుకువచ్చి సీపీఆర్ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోవడంతో రేవతిని డీడీ హాస్పిటల్కు తరలించారు. అక్కడే రేవతి ప్రాణం పోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ను పోలీసులు హుటాహుటిన కిమ్స్దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి ఆ పిల్లాడికి కిమ్స్లో చికిత్స అందిస్తున్నారు.