
హైదరాబాద్, వెలుగు: జపనీస్ కంపెనీ డైఫుకు కో. లిమిటెడ్ సబ్సిడరీ డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో తమ కొత్త ప్లాంట్‌ను ప్రారంభించింది. దీని కోసం రూ. 227 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ శ్రీ హిరోషి గెషిరో మాట్లాడుతూ..“మా స్ట్రాటజిక్ మార్కెట్లలో ఇండియా ఒకటి. ఇండియా లాజిస్టిక్స్ సెక్టార్‌లలో ఆటోమేషన్, ఇన్నోవేషన్లను పెంచడానికి ఈ ప్లాంట్ సాయపడుతుంది” అని అన్నారు. ఇండో-–జపనీస్ ద్వైపాక్షిక సంబంధాన్ని ఈ ప్రాజెక్ట్ మరింత బలపరుస్తుందని చెప్పారు. ఈ ప్లాంట్‌తో ఇంజనీరింగ్, ఆటోమేషన్, ప్రొడక్షన్ డివిజన్లలో 100 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు.