దేశంలో ఒక్కరోజే 3 లక్షల కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3.17 లక్షల కేసులు వచ్చాయి. వైరస్ బారిన పడి 491 మంది మృతి చెందారు. బుధవారంతో పోల్చితే దాదాపు 30 వేల కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 16.41 శాతం ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులు 19.24 లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కరోనా బారిన పడిన వారిలో మరో 2.23 లక్షల మంది కోలుకున్నారు. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 9 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్నటితో పోల్చితే ఒమిక్రాన్ కేసులు 3.63 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం: 

వీగన్స్ ​కోసం స్పెషల్​ చికెన్ 65, సలాడ్స్​

స్టూడెంట్లకు చీప్​గా వీసాలిస్తాం రండి

జాబ్​ రాక కాపురం కూలిపోయింది