హైదరాబాద్ మెట్రో ఆల్ టైం రికార్డ్ : ఒక్క రోజులో 5.47 లక్షల మంది జర్నీ

హైదరాబాద్ మెట్రో ఆల్ టైం రికార్డ్ : ఒక్క రోజులో 5.47 లక్షల మంది జర్నీ

హైదరాబాద్ మెట్రో ప్రయాణించేందుకు నగర ప్రజలు తెగ ఇష్ట పడుతున్నారు. హైదరాబాద్ సిటీలో ప్రజారవాణాలో మెట్రో ఇప్పుడు దూసుకుపోతోంది. మెట్రోలో ప్రయణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.తక్కువ టైం, సౌకర్యవంతంగా ఉండటతో యువత, వృద్ధులు, ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్లు మెట్రోలో ప్రయాణించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  సెప్టెంబర్ 23 నాటికి 5.47 లక్షల మంది రోజువారీ ప్రయాణికులతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. L&T లో హెడ్ ఇన్వెస్టర్ రిలేషన్స్ రామకృష్ణన్ ఈ మెట్రో ప్రజారవాణా ల్యాండ్ స్కేప్ గణాంకాలను తెలుపుతూ హైదరాబాద్ మెట్రో రైడర్ షిప్ లో గణనీయమైన పెరుగుదలను సాధించిందన్నారు. 

2023 ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ క్వార్టర్స్ లో సగటున రోజుకు 3.55 లక్షల మంది  మెట్రోలో ప్రయాణిస్తున్నారు. 2024 రెండో త్రైమాసికానికి అంటే జూలై 1నుంచి సెప్టెంబర్ 30 2023 నాటికి వేగంగా ముందుకు సాగింది. ఈ సంఖ్య రోజు 4.62 లక్షలకు ప్రయాణికులు మెట్రో సేవలు వినియోగించుకున్నారు. 
 
పెరిగిన రైడర్ షిప్ లో పాటు ఈ త్రైమాసికంలో లాభాలు కూడా భారీగా వచ్చాయని L&T  తెలిపింది. ఆదాయంలో అసాధారణమైన 19 శాతం వార్షిక వృద్దిని సాధించింది. పన్నుల తర్వాత లాభంలో  సంవత్సరానికి 45 శాతం వృద్దిని సాధించారు.