స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తామన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో ప్రతి ఏటా లక్ష రూపాయలు జమ చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లాలో కనగర్తి, కాపులపల్లి,రాగినేడు, బ్రాహ్మణపల్లి, బొంపల్లి గ్రామల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీలను కలిసి మాట్లాడారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులకు పొడిగిస్తామన్నారు. రోజువారి కూలీ 4 వందలకు పెంచుతామని హామీ ఇచ్చారు. హస్తం గుర్తుకు ఓటేసి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే విజయరమణారావు.