హైదరాబాద్, వెలుగు : డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తాజా ఏ2 గేదె పాలను విడుదల చేసింది. ఇవి లీటరు ప్యాకులో దొరుకుతాయి. ధర రూ.120 ఉంటుందని కంపెనీ తెలిపింది. కొత్త అసెప్టిక్ ప్యాక్ మొదట్లో హైదరాబాద్, బెంగళూరులో లభిస్తుంది.
తదనంతరం ముంబై, కొచ్చి, నాసిక్, అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, హుబ్బల్లి వంటి నగరాల్లో అమ్ముతారు. కొత్త అసెప్టిక్ ప్యాక్ వల్ల పాలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయని సంస్థ తెలిపింది.