జడ్చర్ల,వెలుగు : జడ్చర్ల పట్టణంలో పాల రైతులు గురువారం రోడ్డుపై పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. విజయడైరీ యాజమాన్యం పాలబిల్లులు చెల్లించడం లేదని, పెండింగ్ బిల్లులన్ని క్లియర్ చేయాలని గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అడిగేందుకు యత్నించారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని పారమర్శించి వెళ్తుండగా.. పట్టణంలో మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకొని తమ సమస్యలు వివరించాలనుకున్నారు.
కానీ రైతులు రోడ్డుపై గుమిగూడేలోపు మంత్రి కాన్వాయ్ పట్టణాన్ని దాటి వెళ్లిపోయింది. దీంతో రైతులు నిరసనగా పాలను రోడ్డుపై పోసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు లు జోక్యం చేసుకుని, రైతులు ధర్నాను విరమింపజేశారు.