డెయిరీ రంగంలో దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది పనిచేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. డైరీ పరిశ్రమ టర్నోవర్ రూ. 10 లక్షల కోట్లకు ఎదిగిందని చెప్పారు. మహిళల ఆర్ధిక శక్తిని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అహ్మదాబాద్‌లో గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దేశంలో డెయిరీ రంగం పురోభివృద్ధి వెనుక నారీ శక్తి అద్వితీయ పాత్ర పోషించిందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఎదిగామని అన్నారు.భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలంటే మహిళల ఆర్ధిక శక్తిని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 30 లక్షల కోట్ల విలువైన ముద్ర రుణాల్లో 70 శాతం లబ్ధిదారులు మహిళలేనని చెప్పారు. దేశంలో పదేండ్లుగా మహిళా స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళల సంఖ్య 10 కోట్లు దాటిందని తెలిపారు.