భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని రేఖాపల్లి అడవుల్లో ఈ నెల 8న ఇద్దరు అమాయక ఆదివాసీలను పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేశారని దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మారోడుబాక, కమలాపురం, రేఖాపల్లి, తుమీర్‌గూడ, సింగనపార గ్రామాల్లోకి భద్రతా బలగాలు ప్రవేశించి నానాబీభత్సం సృష్టించాయని పేర్కొన్నారు. పొలాల్లో పంట కోతల్లో ఉన్న టైంలో పీఎల్‌జీఏతో కాల్పులకు దిగారన్నారు. గ్రామస్తులు ఉన్నా కూడా పట్టించుకోకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం వల్లే ఇద్దరు గ్రామస్తులు చనిపోయారని ప్రకటనలో పేర్కొన్నారు.