బాలయ్యతో అన్‌స్టాపబుల్‌ షోలో సందడి చేయనున్న డాకు మహారాజ్ సినిమా టీమ్.

బాలయ్యతో అన్‌స్టాపబుల్‌ షోలో సందడి చేయనున్న డాకు మహారాజ్ సినిమా టీమ్.

బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న‘అన్‌స్టాపబుల్‌ విత్  ఎన్బీకే ’(UnstoppableWithNBK)  షోకి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఈ షోలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం" సినిమా టీమ్ తో వచ్చి సందడి చేశాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ ని బాగానే అలరించిందని చెప్పవచ్చు. అయితే 8వ ఎపిసోడ్ కోసం షో నిర్వాహకులు డాకు మహారాజ్ సినిమా టీమ్ ని తీసుకురానున్నారు. 

ALSO READ | స్టార్ హీరోతో డేటింగ్ పై స్పందించిన వెటరన్ హీరోయిన్... ఏమన్నారంటే..?

ఇందులోభాగంగా డాకు మహారాజ్ సినిమా డైరెక్టర్ బాబీ కొల్లి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు బాలయ్యతో కలసి సందడి చెయ్యనున్నారు. దీంతో ఈరోజు (ఆదివారం) ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టి ఒకే రోజులో ఫినిష్ చేసందుకు షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా డాకు మహారాజ్ సినిమా వచ్చే ఎడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు. దీంతో ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. ఈ క్రమంలో ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ వంటివి ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలోని థర్డ్ సింగిల్ స్పెషల్ సాంగ్ ని జనవరి 4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ ని కూడా షేర్ చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.