Daku Maharaj: డాకు మహారాజ్ సెకండ్ సింగిల్ రిలీజ్.. మనసును హత్తుకునేలా అనంత శ్రీరామ్ లిరిక్స్

Daku Maharaj: డాకు మహారాజ్ సెకండ్ సింగిల్ రిలీజ్..  మనసును హత్తుకునేలా అనంత శ్రీరామ్ లిరిక్స్

బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి రూపొందిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్  బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్, టీజర్ ఆసక్తిని పెంచాయి. అలాగే ‘ది రేజ్ ఆఫ్‌‌ డాకు’ పేరుతో విడుదలైన మొదటి పాట అంచనాలు పెంచగ తాజాగా సెకండ్ సింగిల్ రిలీజయింది. 

‘చిన్ని చిన్ని’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్‌‌ ఆకట్టుకుంటోంది. తమన్ స్వరపరచిన ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాసారు. సున్నితమైన, సుమధురమైన పదాలతో అనంత శ్రీరామ్ రాసిన పదాలు మనసును హత్తుకునేలా ఉన్నాయి. చిన్ని చిన్ని అంటూ సాగే ఈ పాట ఓ చిన్ని పాపను ఉద్దేశించి సాగుతోంది. నువ్వు తే అంటే.. నీ ముందు తార తీరాలే.. నువ్వు నవ్వుతుంటే అమావాస్య ఐనా దీపావళిగా మారాలే' అనే పదాలు ఆకట్టుకుంటున్నాయి. 

ALSO READ | జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి 

డాకు మహారాజ్ బాలయ్య కెరీర్‌‌‌‌లో ఇది 109వ చిత్రం. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్  హీరోయిన్స్‌‌గా నటిస్తుండగా,  బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.