సాధారణంగా పప్పు ఎలా వండుతారు..? వండటం వచ్చినవారికి, వండింది తినడం చేసేవారికీ ఆల్ మోస్ట్ అందరికీ సమాధానం తెలిసిన ప్రశ్నే ఇది కావొచ్చు.. టమాటా పప్పు, ఆనపకాయపప్పు, తోటకూర పప్పు, గోంగూర పప్పు, మామిడికాయ పప్పు, పప్పు చారు, ముద్దపప్పు... ఈ లిస్ట్ సంగతి కాసేపు ఆపి అసలు విషయంలోకి వెళ్తే... ఇప్పుడు మనం చెప్పుకోబోయే పప్పు.. బంగారంతో చేసిన పప్పు...అవును... మీరు చదివింది అక్షరాలా నిజం.... పప్పును రకరాకాలుగా వండుతున్న విధానం నచ్చకో.. లేక, వెరైటీగా ట్రై చేయాలనో తెలియదు కానీ... పప్పు వండిన తర్వాత పైన నూనె, నెయ్యి ప్లేస్ లో బంగారాన్ని కరిగించి వేశారు ఒక చెఫ్. దీంతో ఈ బంగారం పప్పు ఇప్పుడు హాట్ టాపిక్ కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
రెస్టారెంట్లలో చెఫ్‌లు రోజు రోజుకూ రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. ఆ వంటకాలను స్పెషల్ డిష్‌లుగా ప్రచారం చేస్తే.. వాటిని తినడానికి జనం ఎగబడిపోతూ ఉంటారు. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో చేసిన దాల్ ఫ్రై తయారీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. బంగారంతో పప్పు కర్రీని వండడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీనికి దాల్ కష్కన్ అని పేరు పెట్టారు.అయితే ఇలాంటి వంటకాలతో ఏంటి ఉపయోగం అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇక ఈ దాల్ కష్కన్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 'స్ట్రీట్ ఫుడ్ రిసిప్' అనే అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. దుబాయ్ ఫెస్టివ్ సిటీ మాల్‌లో చెఫ్ రణ్‌వీర్ బ్రార్ తయారు చేశారని.. దానికి 24 క్యారెట్ గోల్డెన్ తడ్కే వాలీ దాల్ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఈ దాల్ కష్కన్ ధర 58 దిర్హామ్‌లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1300 ఉంటుందని తెలిపారు. ఇక ఈ దాల్ కష్కన్ తయారీలో నూనేను వాడలేదు. ఆ స్థానంలో బంగారం పూతను ఉపయోగించారు. అయితే ఈ దాల్ కష్క్న్ తయారీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ALSO READ :- మార్చి 15లోపు కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లు
బంగారంతో తయారు చేసిన దాల్ కర్రీ శరీరంలో ఎలా వెళ్తుందని.. ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు నెటిజన్లు.. ఈ దాల్ కర్రీని తినాలా లేక భద్రంగా దాచుకోవాలా అని అడుగుతున్నారు. వెల్‌కమ్ టు హెవీ మెటల్ పాయిజన్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. రేడియం కా తడ్కా ప్రయత్నించండి అని మరొకరు ట్వీట్ చేశారు. ప్రజలు రోజు రోజుకూ పిచ్చివాళ్లు అయిపోతున్నారన మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు.