జగిత్యాలలో దళిత బంధు రగడ పంచాయతీల ముట్టడి

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో దళిత బందు రగడ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బందును అర్హులకు కాకుండా, అనర్హులైన బిఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారని ధర్మపురిలో దళితులు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ధర్మపురి మండలంలోని దోనూర్,  వెల్గటూర్ మండలంలోని జగదేవ్ పెట్, ఎండపల్లి మండల కేంద్రంల్లో దళితులు నిరసన తెలుపుతున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాలను ముట్టడించి.. అనర్హులకు ఎలా దళిత బంధు కేటాయించారని సర్పంచ్ లను నిలదీస్తున్నారు. దళిత బంధు ఇచ్చిన వారినే ఓట్లు అడగాలని  దళితులు మండిపడుతున్నారు.