జగిత్యాల జిల్లాలో దళిత బంధు కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. దళిత బంధులో అక్రమాలు జరుగుతున్నాయని.. అర్హులైన వారికి ఇవ్వడం లేదని మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన కొందరికి.. డబ్బులున్న వారి దగ్గర లంచాలు తీసుకొని ఇస్తున్నారంటూ.. స్కీమ్అమలుపై దళితులు నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ALSO READ: మహాత్మా జ్యోతిభా పూలే స్కూల్ విద్యార్థులకు అస్వస్థత..
దళిత బంధు పథకంలో రాజకీయం చేయద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామం నుంచి దరఖాస్తులు తీసుకోకుండానే లంచాలు తీసుకొని 14 మందికి దళిత బంధు కేటాయించాలని ఆరోపించారు. గ్రామంలో అర్హత ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని.. లేదంటే పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే సమస్యను అధికారులకు తెలియజేస్తానని మల్లాపూర్ ఎస్సై నవీన్ హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.