వేములవాడ/ గోదావరిఖని/ తిమ్మాపూర్/ చొప్పదండి వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే ఇళ్లను బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు.వేములవాడలో ఎమ్మెల్యే రమేశ్ బాబు ఇంటిని, రామగుండం ఎమ్మెల్యే చందర్క్యాంపు ఆఫీస్‌ను, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీసును , చొప్పదండిలో ఎమ్మెల్యే రవిశంకర్ క్యాంపు ఆఫీసును ముట్టడించారు.
ఈ సందర్భంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, బీసీ బందు, దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. గోదావరిఖనిలో నిరసన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను గౌతమీనగర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు ముందస్తుగాఅరెస్ట్ చేశారు. చొప్పదండిలో పోలీసులు లీడర్లను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.