ఖాళీబాండ్లపై సంతకాలు .. రూ.లక్షల్లో వసూలు

  • దళితబంధులోఅధికార పార్టీ లీడర్ల చేతివాటం
  • రూ. 3 లక్షల వరకు వసూలు
  • ఇందేంటని అడిగితే చంపుతామని బెదిరింపులు
  • కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్పీని ఆశ్రయించిన బాధితులు 

సూర్యాపేట, కోదాడ, వెలుగు: దళితబంధు పథకంలో అధికార పార్టీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పైలెట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు కింద ఎంపికైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకొని లక్షల్లో వసూలు చేశారని లబ్ధిదారుల ఆరోపిస్తున్నారు. ఇదేంటని అడిగితే చంపుతామని బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే ఇచ్చిన యూనిట్లను తిరిగి గుంజుకుంటున్నారని వాపోయారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు స్పందించడం లేదని మండిపడుతున్నారు. ఈ గ్రామానికి ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన జిల్లా చీఫ్‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆరా తీయగా తమ దృష్టికి రాలేదని, అంతా సవ్యంగా జరిగిందని చెప్పడం గమనార్హం.  చేసేది లేక బాధితులు మూడు రోజుల కింద  కలెక్టర్, ఎస్పీని ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నారు. 

యూనిట్ కాస్ట్‌‌‌‌‌‌‌‌లో 30 శాతం ఇవ్వాలంట..

కోదాడ మండలం గుడిబండకు చెందిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేత నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నేతగా చెలామణి అవుతున్నారు. ప్రభుత్వం ఏడాది కింద ఈ గ్రామాన్ని ఫైలట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగానే ఆయన అనుచరులు రంగంలోకి దిగారు. తాము చెప్పిన వారికే దళితబంధు వస్తుందని ప్రచారాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల జాబితాలో పేరు ఉండాలంటే  నియోజకవర్గ ముఖ్య నేతకు10శాతం, మండల ముఖ్య నేతకు 10 శాతం, తమకు 10శాతం కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇవ్వాలని కండిషన్‌‌‌‌‌‌‌‌ పెట్టారు.  ఇందుకు అంగీకరించి కొంత డబ్బులు చెల్లించిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.  అంతేకాదు వారి నుంచి ముందుగానే ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు.  డెయిరీ , టెంట్ హౌస్, కిరాణా షాపులు తదితర వాటి కోసం అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్న  దాదాపు 30మంది లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. 

అడిగితే బెదిరింపులు 

పథకం ప్రారంభం రోజున అధికారుల సమక్షంలో జాబితాలో ఉన్న లబ్ధిదారులను చూపించి అంతా సవ్యంగా జరుగుతున్నట్లు కలరింగ్ ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం వారి అకౌంట్లకు సంబంధించిన ఓచర్లపై సంతకాలు చేయించుకుని డబ్బులను డ్రా చేయడం ప్రారంభించారు. ఇదేంటని ప్రశ్నిస్తే షెడ్ల  ఏర్పాటుకు తాము చెప్పిన చోట ఐరన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలని, తాము ఎంపిక చేసిన బర్రెలను తీసుకోవాలని కండిషన్లు పెట్టారు. లేదంటే రూపాయి కూడా ఇవ్వమని బెదిరించడంతో లబ్ధిదారులు అలాగే చేశారు.  డెయిరీ యూనిట్లకు సంబంధించి 8 బర్రెలు ఇవ్వాల్సి ఉండగా నాలుగు బర్రెలే ఇచ్చారు. మిగిలినవి వాళ్లే ఉంచుకున్నారు. దాణా కోసం  కేటాయించిన డబ్బులను కూడా లబ్ధిదారులకు తెలియకుండానే డ్రా చేసుకున్నారు.  బర్రెలు సరిగ్గా పాలు ఇవ్వకపోవడంతో మిగిలిన నాలుగు బర్రెలు ఇవ్వాలని కోరగా..  తమ వద్ద సంతకాలు చేసిన ఖాళీ బాండ్‌‌‌‌‌‌‌‌పేపర్లు ఉన్నాయని, ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరింపులకు దిగారు. గట్టిగా ప్రశ్నిస్తే అంతకుముందు ఇచ్చిన బర్రెలను లాకెళ్లారని లబ్ధిదారులు వాపోయారు. 

నాలుగు బర్లు వాళ్లే తీసుకున్నరు

దళిత బంధు పధకం కింద నాకు డైరీ యూనిట్‌‌‌‌‌‌‌‌ మంజూరైంది. పథకం రాకముందే నా దగ్గర గ్రామానికి చెందిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు  రూ. లక్ష వసూలు చేశారు. ఖాళీ బాండ్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌పై సంతకాలు పెట్టించుకున్నరు.  పథకం కింద 8 బర్లు ఇవ్వాల్సి ఉండగా  నాలుగు ఇచ్చి  నాలుగు వాళ్లే ఉంచుకున్నరు.  ఇదేంటని అడిగితే బెదిరిస్తున్నరు.

- పద్మ, గుడిబండ

టెంట్‌‌‌‌‌‌‌‌ హౌస్ కింద ఆటో ఇచ్చిన్రు

నాకు దళిత బంధు కింద టెంట్‌ హౌస్‌ మంజూరైంది. యూనిట్‌‌‌‌‌‌‌‌ గ్రౌండింగ్‌‌‌‌‌‌‌‌ కాకముందే  రూ. 2 లక్షలు తీసుకు న్నరు. పథకం ప్రారంభం రోజున ఆటో మాత్రమే ఇచ్చిన్రు. మిగిలిన డబ్బుల గురించి అడిగితే లేవు పొమ్మన్నరు.  గట్టిగా  అడిగితే ఇబ్బందుల పెట్టిన్రు.  అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలి

- ఊదర అశ్విని, గుడిబండ