మతం మారినా రిజర్వేషన్లు మార్చొద్దు: దళిత క్రిస్టియన్ల విజ్ఞప్తి

మతం మారినా రిజర్వేషన్లు మార్చొద్దు: దళిత క్రిస్టియన్ల విజ్ఞప్తి
  • జస్టిస్ ​బాలకృష్ణన్​కమిషన్​కు దళిత క్రిస్టియన్లు విజ్ఞప్తి

పంజాగుట్ట, వెలుగు:దళితులుగా పుట్టి మతం మారిన కారణంగా రిజర్వేషన్లు మార్చడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ బాలకృష్ణన్​కమిషన్ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో హరితప్లాజాలో  సీఆర్ఐఐ ఆధ్వర్యంలో శనివారం రిటైర్డ్​ఐపీ ఎస్​ డాక్టర్ బాబురావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, నేషనల్ క్రిస్టియన్ బోర్డు అధ్యక్షుడు జాన్ మాస్క్, ప్రొఫెసర్ గాలి వినోద్ తదితరులు హాజరై మాట్లాడారు. దేశంలో ఏ కులానికి లేనివిధంగా కేవలం దళితులు మతం మారిన వెంటనే, రిజర్వేషన్లను తొలగించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.