మరిమడ్లలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

 కోనరావుపేట, వెలుగు:  రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో  ఆదివారం అర్ధరాత్రి  అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా దుండగులను వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ ​చేస్తూ దళిత సంఘం నాయకులు, సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ రేణుక రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

 కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.