
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిలను కరీంనగర్ కు చెందిన దళిత కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు గడ్డం వంశీతో సుదీర్ఘంగా చర్చించారు. మాల సామాజిక వర్గానికి చెందిన వంశీని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు, వంశీనీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. వంశీని సన్మానించి అభినందనలు తెలిపిన వారిలో దళిత కాంగ్రెస్ నాయకులు వెన్న రాజమల్లయ్య, నాత శ్రీనివాస్, విక్టర్, కాడే సూర్యనారాయణ, కాడేశంకర్ , కుంభాల రాజ్ కుమార్, దండి రవీందర్, గూడ కనకయ్య , దారం ఆంజనేయులు లతో పాటు తదితరులు ఉన్నారు.