పీరియడ్ వచ్చిందని.. క్లాస్ రూం బయట ఎగ్జాం రాయించిన్రు

పీరియడ్ వచ్చిందని.. క్లాస్ రూం బయట ఎగ్జాం రాయించిన్రు
  • తమిళనాడు స్కూల్ లో ‌‌నిర్వాకం 

చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. నెలసరి(పీరియడ్స్) సమయంలో ఉందన్న కారణంతో 8వ తరగతి చదువుతున్న ఓ దళిత  విద్యార్థినిని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తరగతి గది బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  సెంగుట్టాయిపాళయంలోని స్వామి చిద్భవానంద స్కూల్‌‌పై తమిళనాడు విద్యా శాఖ విచారణకు ఆదేశించింది. 

కాగా, తమ కూతురు నెలసరిలో ఉందని..ఆమె పరీక్ష రాసేందుకు తరగతి గదిలోనే సపరేట్ బెంచ్ ఏర్పాటు చేయాలని  కోరినా.. పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదు. మరుసటి రోజు కూడా అలాగే చేయడంతో బాలిక తల్లి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వైరల్ అయింది.