జయంతి వేడుకలకు ఏర్పాట్లేవీ ?

జయంతి వేడుకలకు ఏర్పాట్లేవీ ?
  • బోధన్​ మున్సిపల్ కమిషనర్​, అధికారులపై దళిత సంఘాల ఆగ్రహం 

బోధన్, వెలుగు : అంబేద్కర్​ జయంతి వేడుకలకు సరైన ఏర్పాట్లు చేయలేదని బోధన్​ మున్సిపల్​ కమిషనర్ వెంకట నారాయణపై దళిత సంఘాలు మండిపడ్డాయి. అధికారికంగా నిర్వహించాల్సిన వేడుకల విషయంతో నిర్లక్ష్యం చేసినందుకు కమిషనర్​పై చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్​ చైర్మన్​ ఆనంపల్లి ఎల్లయ్య, దళిత సంఘాల నాయకులు ఉన్నతాధికారులను కోరారు.  కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా టెంట్లు, కుర్చీలు, మైక్​ ఏర్పాటు చేయలేదన్నారు.  వేడుకలకు రూ.50 వేలు కేటాయించామని, సబ్​ కలెక్టర్​ ఆదేశాల మేరకే ఏర్పాట్లు చేశామని మున్సిపల్​ కమిషనర్​ వెంకటనారాయణ తెలిపారు. 

అంబేద్కర్​ విగ్రహానికి నివాళి

బోధన్​లోని అంబేద్కర్ విగ్రహానికి ఏసీపీ పి.శ్రీనివాస్​, తహసీల్దార్​ విఠల్​, పట్టణ సీఐ వెంకట నారాయణ, కాంగ్రెస్​  పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, పట్టణ అధ్యక్షుడు పాషామోయినొద్దీన్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దవార్ గంగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్​ భర్త శరత్ రెడ్డి, దళిత నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.