దళితబంధు ఇవ్వాలంటూ హైవేపై రాస్తారోకో

నిర్మల్ జిల్లా: భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో జాతీయ రహదారిపై దళిత మహిళలు రాస్తారోకో చేశారు. గ్రామంలోని దళితులకు దళితబంధు పథకం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మహిళలు ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకుని గ్రామస్తులు వారికి మద్దతు నిలిచారు. దీంతో గ్రామం వద్ద హైవేపై ట్రాఫిక్  పెద్దఎత్తున స్థంభించిపోయింది. 

రాస్తారోకో వల్ల ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. రాస్తారోకో చేయడం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయిందని.. ఎంతో మంది ఇబ్బందిపడుతున్నారని సర్ది చెప్పారు. దళితబంధు కోసం గ్రామస్తులు ఆందోళన చేపట్టిన విషయాన్ని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి చేరవేశామని..  ప్రభుత్వం స్పందించేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కోరామన్నారు.