కరీంనగర్ లో దళిత సంఘాల ఆందోళన

కరీంనగర్ లో దళిత సంఘాల ఆందోళన

కరీంనగర్: హైదరాబాద్ పంజాగుట్టలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్ విగ్రహ తొలగింపు వివాదంపై రాష్ట్రంలోని దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన నాయకులు… అంబేద్కర్ కు అందరూ అత్యున్నత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్ లో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జాతి నిర్మాతను అవమానించారంటూ విగ్రహం దగ్గర దళిత సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. పోలీసులు వారితో మాట్లాడి ట్రాఫిక్ క్లియర్ చేశారు.