దళితబంధు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలకేనా ?

దళితబంధు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలకేనా ?

ఏటూరునాగారం, వెలుగు : దళితబంధు పథకం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలకు మాత్రమే ఇస్తరా అని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు దళితులు ప్రశ్నించారు. ఆదివారం ఏటూరు నాగారం – తుపాకుల గూడెం గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇండ్లు, పొలాలు లేని దళితులకు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములు ఉండి, ఆర్థికంగా ఉన్న లీడర్లు, కార్యకర్తలకే ఇండ్లు, దళితబంధు ఇస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్‌‌‌‌ స్పందించి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు.