కామారెడ్డి/పిట్లం, వెలుగు: దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట పిట్లం మండలానికి చెందిన దళితులు ధర్నా నిర్వహించారు. తాము అర్హులైన్నప్పటికీ దళితబంధు ఇవ్వటం లేదని, అధికార పార్టీకి సంబంధించిన వాళ్లకే ఇస్తున్నారని ఆరోపించారు. ఇస్తే అందరికి ఇవ్వాలని లేదంటే ఎవరికీ ఇవ్వనవసరం లేదని అన్నారు.
పిట్లం, చిల్లర్గికి చెందిన పలువురు దళితులుధర్నా చేశారు. ప్రతి ఒకరికి దళితబంధు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ సూపరిండెంట్‌కు వినతి పత్రం అందించారు.