గన్నేరువరం, వెలుగు: గృహలక్ష్మీ స్కీములో పేరు రాలేదని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో మంగళవారం దళితులు నిరసన చేపట్టారు. గృహలక్ష్మి పథకం ఎంపికలో సగం మందికి పైగా ఇండ్లు, భూములు ఉన్న వారినే ఎంపిక చేశారని వారు ఆరోపించారు.
గతంలో ఇండ్లు కట్టుకున్న వారికి కూడా గృహలక్ష్మి అమలు చేశారని వాపోయారు. పూరి గుడిసెలో నివసిస్తున్న తమను స్కీముకు ఎంపిక చేయకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీటీసీ రవీందర్ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారి పేర్లే జాబితాలో వచ్చాయని మండిపడ్డారు.