జగిత్యాల జిల్లా : మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకా (ధర్మపురి నియోజకవర్గం)లో రెండవ రోజు దళితులు నిరసన చేపట్టారు. మంగళవారం (అక్టోబర్ 10న) ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. దళిత బంధులో అవకతవకలు జరిగాయని బుధవారం (అక్టోబర్ 11న) ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామపంచాయతీ ముట్టడికి ప్రయత్నించారు. దళిత బంధు ఇచ్చిన వారినే ఓట్లు అడగాలని దళితులు స్పష్టం చేస్తున్నారు.
నిరుపేదలను గుర్తించి... దళిత బంధు కేటాయించాలని.. లేకపోతే ఈసారి ఓట్లు వేయమంటున్నారు. దళితుల ఆందోళనలతో తిమ్మాపూర్ గ్రామపంచాయతీ వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఎంపీడీవో వచ్చేవరకు తాము నిరసన వ్యక్తం చేస్తామని, రాకపోతే సెక్రెటరీని బందిస్తామని దళితులు హెచ్చరించారు.
Also Read :- హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ టైమింగ్స్ మార్చండి
ధర్మపురి మండలం నేరెళ్లతో పాటు రామయ్యపల్లి గ్రామాల్లోనూ దళితులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో దళిత బంధు రగడ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తలనొప్పిగా మారింది. దళిత మంత్రి అయ్యి ఉండి దళితులకు అన్యాయం చేస్తున్నారని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.