- రూ.500కోట్లతో సెగ్మెంట్లో విద్యాభివృద్ధి
వనపర్తి, వెలుగు : నియోజకవర్గంలోని గవర్నమెంటు స్కూళ్ల అభివృద్ధికి దాదాపు రూ.500 కోట్లను కేటాయించినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలోని దళితవాడ జడ్పీ హైస్కూల్‌ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని దళితవాడ పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. తొలుత ఆచార్య జయశంకర్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నియోజకవర్గంలో పెబ్బేరు, ఖిల్లా గణపురం, మామిడిమాడ, పాఠశాలలతో పాటు దళితవాడ జడ్పీ హైస్కూలును సైతం దత్తతకు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ స్కూళ్లను ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో ఆధునీకీకరిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యనిభ్యసించిన వనపర్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం దాదాపు రూ.500 కోట్లు కేటాయించి అభివృద్ధి పరచనున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో విద్య వైద్యం నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, స్థానిక కౌన్సిలర్లు పాఠశాలల ఉపాధ్యాయులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
డీ8 కాలువను పరిశీలన
రేపల్లి: పొలికెపహాడ్ హామ్లెట్ గ్రామం అల్లీపూర్ నుంచి మోటార్ సైకిల్ పై కేఎల్ఐ డీ-8 కెనాల్ వెంట గుడిపల్లి ప్రధాన కాలువ గేట్ల వరకు ఎమ్మెల్యే మేఘారెడ్డి పర్యటించారు. గుడిపల్లి వద్ద ఉన్న ప్రధాన గేట్ల వద్దనే నీరు తక్కువగా విడుదలవుతోందని అధికారులను అక్కడికి పిలిపించి గేట్లను ఓపెస్ చేయించారు.