డ్యామ్ కూలి 40 మంది మృతి

నైరోబి: కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ డ్యామ్ కూలి 40 మంది మృతి చెందారు. కొద్ది రోజులుగా కెన్యాలో భారీ వర్షాలు కురుస్తుండంతో.. రిఫ్ట్ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్ నీటి నీటి ఉదృతికి కొట్టుకుపోయింది. దీంతో వరదలు సంభవించి.. దిగువ ప్రాంతాల్లోకి నీరు ప్రవహించింది. వరద ధాటికి పలు ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. 

వరదల్లో కొందరు గల్లంతు కాగా.. మరికొందరు బురదలో చిక్కుకున్నారు. కాగా.. భారీ వర్షాలకు ఇప్పటికే ఈ దేశంలో భారీగా మరణాలు సంభవిస్తుండగా.. డ్యామ్ ఘటనతో ఆ సంఖ్య 120కి చేరింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బురదలో చిక్కుకున్న వారిని బయటకి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.