
బెల్లంపల్లి రూరల్, వెలుగు: వేమనపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న రాజారాం, గొల్లగూడంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో ఆదివారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. గొల్లగూడంలో రెండు చేతి పంపులు ఉన్నా అవి పాడైపోయి తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందన్నారు.
తక్షణమే రిపేర్ చేయించాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీజేపీ మండల అధ్యక్షులు బైస మల్లేష్, ప్రధాన కార్యదర్శి సంతోష్, బీజేపీ నాయకులు, మహిళలు
పాల్గొన్నారు.