పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ ...ఎగసిపడి వృథాగా పోతున్న నీరు

వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి గ్రామానికి తాగు నీరందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. నేటికీ కొన్ని గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరా అరకొరగానే అందుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడగల్ గ్రామంలో పైపులు పగిలిపోయి  తాగునీరు వృథాగా పోతోంది.పడగల్ గ్రామన్ని మంత్రి వేములప్రశాంతరెడ్డి దత్తత తీసుకున్నారు.  మిషన్ భగీరథ పనులను నాశిరకంగా చేయడంతో పైపులు పగిలి నీరు వృధాగా పోతోందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

పగిలిన ప్రాంతంలో భారీ ఎత్తున నీరుఎగిసిపడుతుంటంతో ప్రధాన రహదారిపై మట్టిచేరి వాహనాదారులకు ఆటంకంగా మారింది. అయితే ప్రధాన రహదారిపై వాహనదారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న వారు పైప్ లైన్ పగిలిన విషయాన్ని సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. 

గతంలో కూడా...

గతంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల  పైప్ లైన్ పగిలి నెలలు గడవక ముందే మళ్లీ పైప్ లైన్ పగలడంతో సమీప ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు. ఏది ఏమైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పగిలిన పైప్ లైన్ కు వెంటనే మరమ్మతు చేపట్టి, భవిష్యత్తు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

                             ALSO READ:వీళ్లసంగతేంటీ : ప్రముఖ హీరోలు, నటీమణులతో.. డ్రగ్స్ కిలాడీ కేపీ చౌదరి ఫొటోలు