జాతీయ స్థాయి యోగా పోటీలకు దామెర స్టూడెంట్‌‌

ఆత్మకూరు (దామెర), వెలుగు : జాతీయ స్థాయి యోగా పోటీలకు హనుమకొండ జిల్లా దామెరకు చెందిన స్టూడెంట్‌‌ ఎంపికయ్యారు. దామెరకు చెందిన సోనబోయిన ప్రణవి వరంగల్‌‌ ఉర్సునందు గల మహాత్మా జ్యోతి బా పూలే గురుకుల కాలేజీలో ఇంటర్‌‌ ఫస్ట్‌‌ ఇయర్‌‌ చదువుతోంది.

ఈ నెల 8, 9 తేదీల్లో నల్గొండలో జరిగిన అండర్‌‌ 19 స్టేట్‌‌ లెవల్‌‌ యోగా పోటీల్లో ప్రతిభ చూపి నేషనల్‌‌ లెవల్‌‌కు ఎంపికైంది. 19 నుంచి 23 వరకు కలకత్తాలో జరుగే పోటీలకు హాజరుకానుంది. ప్రణవిని గ్రామస్తులు, దామెర హైస్కూల్‌‌ హెచ్‌‌ఎం రాజేశ్‌‌ కుమార్‌‌, కమలాకర్ అభినందించారు.