దామెరవంచ ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురుకులం తనిఖీ

 దామెరవంచ ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురుకులం తనిఖీ

గూడూరు, వెలుగు :మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా గూడూరు మండలం దామెరవంచ ట్రైబల్ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురుకుల స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనిఖీ చేశారు. టీచర్ల హాజరు, స్టూడెంట్లకుఇస్తున్నభోజనాన్నిపరిశీలించారు.టీచర్లు గైర్హాజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ముత్తయ్యకు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా ఆయన రిసీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. 

అనంతరం టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 100 శాతం మార్కులు వచ్చేలా కృషి చేయాలని, స్టూడెంట్లకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని వైస్ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. స్థానికంగా ఉండని టీచర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వట్టివాగు చింతలగట్టు సమ్మక్క, సారలమ్మ జాతరను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఆయన వెంట వెంకన్న, కొమ్మాలు, శివ, నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంపత్, చంటి, యాకయ్య పాల్గొన్నారు.