టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజునుంచే రికార్డులు బ్రేక్ చేస్తూ, క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. పుష్ప 2 రిలీజ్ అయిన 20 రోజుల్లోనే రూ.1600 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ 3వ స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో బాహుబలి 2: ది కంక్లూజన్ ఉండగా రెండో స్థానంలో హిందీ మూవీ దంగల్ ఉంది.
అయితే మంగళవారం పుష్ప 2 సినిమాలోని దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. ఈ పాటని పుష్ప 2 సినిమా డైరెక్టర్ సుకుమార్ లిరిక్స్ అందించగా అల్లు అర్జున్ పాడాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. అయితే ఈ సమయంలో ఈ పాటని రిలీజ్ చేసినందుకు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Also Read :- సంధ్య థియేటర్ FIRలో పుష్ప నిర్మాతలు
ఈ పాట దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ లిరిక్స్ స్టార్ట్ అవుతాయి. ఈ లిరిక్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన షెకావత్ పాత్రని కించపరిచే విధంగా ఉన్నాయని, అలాగే ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీసు కేసులలో ఉండటంతో ఈ సమయంలో ఇలాంటి పాటలు రిలీజ్ చెయ్యడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.