మళ్లీ పుష్ప 2 నుంచి దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ రిలీజ్..

మళ్లీ పుష్ప 2 నుంచి దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ రిలీజ్..

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి మంగళవారం (డిసెంబర్ 24) దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఏమైందో ఏమోగానీ అదేరోజే యూట్యూబ్ నుంచి ఈ పాటని తొలగించారు. 

అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయ్యో బెయిల్ మీద రిలీజ్ అవ్వడం, అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి జరగడం, పోలీసు విచారణలు వంటివాటితో ఈ పాటపై నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది. దీంతో ఈ కారణంగానే యూట్యూబ్ నుంచి తొలగించారని టాక్ వినిపిస్తోంది.

ALSO READ : 2024లో రిలీజైన సినిమాలు.. ఏది హిట్టు.. ఏది ఫట్టు?

ఈరోజు (శనివారం) దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ యూట్యూబ్ లో మళ్లీ రిలీజ్ అయ్యింది. ఈ పాటకి పుష్ప 2 సినిమా డైరెక్టర్ సుకుమార్ లిరిక్స్ అందించగా అల్లు అర్జున్ పాడాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ఈ పాట విన్న ఆడియన్స్ సూపర్ గ ఉందంటున్నారు. 

పుష్ప  సినిమా రిలీజ్ అయిన మొదటిరోజునుంచే రికార్డులు బ్రేక్ చేస్తూ, క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. పుష్ప 2 రిలీజ్ అయిన 22 రోజుల్లోనే రూ.1700 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ 2వ స్థానంలో నిలిచింది. అలాగే నార్త్ లో దాదాపుగా రూ.715 కోట్లు (నెట్) కలెక్ట్ చేసింది. దీంతో బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో టాప్ లో నిలిచింది.