ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించింది.. సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: దామోదర రాజనర్సింహా

ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించింది.. సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: దామోదర రాజనర్సింహా

ఎన్నోఏళ్ల పోరాటం ఫలించిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ.. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సుప్రీం తీర్పును స్వాగిస్తున్నామని చెప్పారు. సుప్రీం తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు దామోదర..  రాష్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్నారు.  ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ చొరవ ఉందన్నారు.  తీర్పుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.  ఎస్సీ  వర్గీకరణ కోసం ఎంతో మంది పోరాటం చేశారన్నారు.

ఎస్సీ వర్గీకరణపై బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.  ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతుంటే  బీఆర్ఎస్ ఆందోళనలు చేయడం కరెక్ట్ కాదన్నారు. దండోర ఉద్యమానికి అందరూ  మద్దతిచ్చారని.. సుప్రీం తీర్పును  ప్రతి ఒక్కరు స్వాగతించాలని చెప్పారు. 

 మరో వైపు బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళన చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నిరసనలు చేస్తున్నారు. దీంతో స్పీకర్ సీరియస్ అయ్యారు. వర్గీకరణ తప్ప ఏ విషయంపై మాట్లాడినా మైక్ కట్ చేస్తామని చెప్పారు.