తెలంగాణలో 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది : దామోదర్ రాజనర్సింహా

తెలంగాణలో 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది : దామోదర్ రాజనర్సింహా

జోగిపేట వెలుగు: ఆందోల్​ నియోజకవర్గంలో వివిధ పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా, భార్య   పద్మిణి, కూతురు త్రిషాతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లడుతూ..నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.

రాష్ట్రంలో 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ సొంత గ్రామమైన వట్​పల్లి మండలంలోని  పోతులబోగూడ గ్రామంలో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ట్రేడ్​ ప్రమోషన్​ చైర్మన్​ భిక్షపతి మరవెళ్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.