వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

వడ దెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్‌ను  హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు.  ఎండలు ముదురుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి సూచించారు. బయటకు వెళ్లినప్పుడు ఎండదెబ్బ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడదెబ్బపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి దామోదర ఆదేశించారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకూ అన్ని చోట్ల వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు
  • ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్ళాలి
  • తమ చుట్టూ ఉన్నవారిలో ఎవరికైనా వడ దెబ్బ తగిలితే, వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు బాధితున్ని తరలించాలి. 108 అంబులెన్స్‌కు సమాచారం చేరవేయాలి.
  • పిల్లలు, వృద్దులు, గర్భిణుల విషయంలో కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి