
తూప్రాన్, వెలుగు: పేదల ఆరోగ్య బాధ్యత సర్కార్ దే అని రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ లో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పేద కుటుంబాలను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించామన్నారు.
ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఆరు గ్యారంటీలు అందజేస్తామన్నారు. సమావేశంలో తూంకుంట నర్సారెడ్డి, కలెక్టర్ రాజార్షి షా, అడిషనల్ కలెక్టర్ రమేశ్, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఆర్డీవో జయచంద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, రవీందర్ గుప్త, భగవాన్ రెడ్డి, ఉమర్, అనిల్, వంశీధర్ రెడ్డి, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి, సీఐ శ్రీధర్, ఎస్ఐ శివానందం పాల్గొన్నారు.
వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలె
మెదక్ టౌన్: జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మెదక్ జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రెస్క్లబ్అధ్యక్షుడు దొంతి నరేశ్ మంత్రి దామోదర రాజనర్సింహాను కోరారు. శనివారం మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహాచారి, ప్రెస్ క్లబ్ బాధ్యులు కృష్ణ పలువురు జర్నిలిస్టులు పాల్గొన్నారు.